BRS నేత, SC, ST కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు HYD- నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. రూ. 5 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కోరిన న్యాయస్థానం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై కేసు నమోదవగా.. గురువారం అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa