ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 08:26 PM

తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని.. 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. హైదరాబాద్, నిజామాబాద్‌, హనుమకొండ, మెదక్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. మరో వారం రోజులపాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa