రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అమలుచేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా మంగళవారం నాటికి రెండెకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. ఖమ్మం జిల్లాలో రైతు భరోసాకు 3, 51, 592 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి సాగు భూమి ఆధారంగా రూ. 371. 06 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 1, 63, 119 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 104, 74, 31, 487 జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు
![]() |
![]() |