ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతరలో సమ్మక్క- సారలమ్మ జాతర ఒకటి . ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క - సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. అమ్మవార్లకు బెల్లాన్ని(బంగారాన్ని) సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకెళ్లినా చాలు.. ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.
![]() |
![]() |