ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండలం రామారo గ్రామంలో మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం ఎల్లమ్మ దేవత కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు అధికంగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తప్పేట సుధాకర్, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పడాల రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి కనకయ్య, దుర్గాప్రసాద్, గోపాల్, కిష్టారెడ్డి, మల్లేశం,మహేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa