హైదరాబాద్ నగరంలో అనుమతులు లేని హోర్డింగులపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ఈ సంస్థ, నగరంలో అక్రమంగా వెలిసిన హోర్డింగుల తొలగింపునకు నడుం బిగించింది.హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, కొత్వాల్‌గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 53 భారీ హోర్డింగులను హైడ్రా సిబ్బంది తొలగించింది. ఈ సందర్భంగా యాడ్ ఏజెన్సీల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమై, అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తామని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, మేడ్చల్ జిల్లాలోని కోమటికుంట చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa