ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ ల్లో ఆ ఏరియాల్లో తాగునీటి సరఫరా బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 07:30 PM

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ముందే తాగు నీటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం (ఫిబ్రవరి 17) రోజున ఉదయం నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది. కొండపాక పంపింగ్ స్టేషన్‌లో కీలకమైన వాల్వ్‌లను మార్చేందుకు వీలుగా.. ఫిబ్రవరి 17న ఉదయం 6 గంటల నుంచి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు హైదరాబాద్ జలమండలి శుక్రవారం (ఫిబ్రవరి 14న) ప్రకటనలో తెలిపింది.


కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 ఎంఎం డయా ఎమ్ఎస్ పంపింగ్ మెయిన్‌పై 900 ఎంఎం డయా బీఎఫ్, ఎన్ఆర్వీ వాల్వ్‌లను హైదరాబాద్ జలమండలి ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది.


తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..


కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, భరత్‌నగర్, బోరబండ, మోతీనగర్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, వెంగళ్‌రావ్ నగర్, ఎల్లారెడ్డిగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఫతేనగర్, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, గాయత్రినగర్, బాబానగర్, బాలాజీపేట, హస్మత్‌పేట్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు ప్రకటించారు.


ఇక.. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పైనగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతంనగర్, సాయినాథపురంలోనూ నీటి సరఫరా 24 గంటల పాటు నిలిచిపోనున్నట్టు తెలిపారు.


చర్లపల్లి, సాయిబాబానగర్‌, రాధిక, కొండాపూర్‌, డోయన్స్‌, మాదాపూర్‌లో కొంత భాగం, హఫీజ్‌పేట, మియాపూర్‌, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, తెల్లాపూర్‌, బోల్లారం, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హాకిమ్‌పేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, AIIMS, బీబీనగర్.. ప్రాంతాల్లో కూడా తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు.


నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే సమయంలో తాగునీటి కోసం ముందుగానే ఆయా ప్రాంతాల ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హైదరాబాద్ జలమండలి సూచించింది. ఫిబ్రవరి 18 మంగళవారం ఉదయం 6 గంటలకు తాగునీటి సరఫరా తిరిగి పునరుద్ధరించనున్నట్టు జలమండలి అధికారులు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa