నల్గొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి లో కవి కోకిల సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు పానుగోతు నరసింహ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించుకొని రాణించాలన్నారు
ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు బాలిక విద్య గురించి విద్యార్థులు ప్రదర్శించిన నాటిక పలువురిని ఆకర్షించింది ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు బైరం శ్రీనివాస్ జ్యోతిర్మయి ఉపాధ్యాయులు చిటుప్రోలు సదానందం జ్యోతి మెర్సీ ప్రభావతి హేమీమా సుభాషిని మంజుల వాణి లింగస్వామి రామ్మూర్తి జానకి రాములు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa