మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే 7వ తేదీ నుంచి 31 వరకు తెలంగాణ వేదికగా మిస్ వరల్డ్-72 పోటీలు జరుగనున్నాయి. హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్-72 ప్రారంభ, ముగింపు వేడుకలు జరుగనున్నాయి. అలాగే గ్రాండ్ ఫినాలే కూడా హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వాహణ సంస్థ తెలిపింది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa