దేశంలో ఎక్కడ లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురం 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్‌ఎఫ్‌టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సుమారు రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేశారు. గతేడాది నవంబర్‌లో తాపడం పనులను ప్రారంభించి ఈ నెల 10 తేదిన పూర్తిచేశారు.
స్వర్ణ విమాన గోపుర విశేషాలు
ఎత్తు: 5.05 అడుగులు
వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
బంగారం వినియోగం: 68 కిలోలు
స్వర్ణ తాపడం ఖర్చు: రూ.3.80 కోట్లు
మొత్తం వ్యయం: రూ.8 కోట్లు
ఈ గోపురాన్ని భవ్యమైన కృష్ణశిల్పకళా వైభవంతో రూపొందించారు. స్వర్ణ రేకులతో కప్పిన ఈ గోపురం భక్తులకు కనువిందు చేయనుంది.ప్రతిష్టాపన అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
మార్చి 1 నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 8న స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి అలంకార, వాహన సేవలు వైభవంగా సాగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa