ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 06:44 PM

పిట్లం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాలలో ఆదివారం గురుకుల ఐదవ తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు.
పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. 181 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, ఇద్దరు గైర్ హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షా కేంద్రాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తనిఖీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa