ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన "కాట దంపతులు"

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 11:53 AM

అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని బీరంగూడ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారు, వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, మహాశివరాత్రి నిబద్ధత, అచంచల విశ్వాసం, త్యాగానికి ప్రతీకగా భక్తులందరూ ఉపవాస దీక్షలు, జాగారాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శివార్చన చేయడం గొప్ప ఆనందదాయకమని పేర్కొన్నారు. సృష్టి లయకారునిగా భవభయహరుడైన పరమశివుడు తెలంగాణ ప్రజలకు, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను కలిగించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa