ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ముసాయిదా బిల్లుకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa