హైదరాబాద్ బాలానగర్‌కి చెందిన సాయి సుబ్రమణ్యం(21) అవయవదానం ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది. రోడ్డు ప్రమాదంలో సాయి బ్రెయిన్‌డెడ్ అవడంతో అతడి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు.
అతడి వద్ద గుండె, కాలేయం, 2 కిడ్నీలు, ఊపిరితిత్తి సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి పునర్జన్మ అందించినట్లు TGSRTC ఎండీ సజ్జనార్ 'X'వేదికగా తెలిపారు. 'అపోహలు వద్దు. అవయవ దానం చెయ్యండి. ప్రాణదాతలు కండి' అని సందేశమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa