ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:42 PM

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మ కు న్యాయస్థానం తాజాగా మరణశిక్ష విధించింది. సుభాష్ శర్మ బీహార్ కు చెందిన నేరస్తుడు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలకు జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కాగా, తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు. తాము పిల్లలు గలవాళ్లమని, ఈ కేసుతో తమకు సంబంధం లేదని అమృత బాబాయి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. తనకు ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతిరావు అమృత తండ్రి 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు.2018లో సెప్టెంబరు 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కసితో మారుతిరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హత్య చేయించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa