గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని దేవాలయ భూములకు సర్వే నిర్వహించి హద్దు రాళ్ళు పాతుటకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఆయా సర్వే నెంబర్లలో భూములు కలిగి ఉన్న 41మంది రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 21 నుండి ఆలయ భూములకు సర్వే నిర్వహిస్తామని సంబధిత రైతులు అందుబాటులో ఉండాలని అధికారులు పేర్కొన్నారు. అధికారులు చేపట్టబోయే సర్వేకు గ్రామ పెద్దలు సహకరించాలని దేవాలయ చైర్మన్ పరమేశ్ గౌడ్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa