హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని యువకులు కొట్టి చంపేశారు. బాబా నగర్‌లో జాకీర్ ఖాన్(62) ఓ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి కొందరు యువకులు తన షాపు ముందు.
కూర్చీలు వేసుకొని కూర్చోగా తన షాపు ముందు కూర్చోవద్దని చెప్పాడు. ఈ క్రమంలో గొడవ జరగడంతో జాకీర్ ఖాన్‌ను వారు తీవ్రంగా కొట్టారు. గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa