తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. HYD-మిషన్ భగీరథ కార్యాలయంలో అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తాగునీటి సరఫరాపై సమీక్షించారు. గతంలో తాగునీరు అందని గ్రామాలకు ఈసారి తాగునీరు అందేలా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa