దేవరకొండ: రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని పెంపొందిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం ఈద్గా, మక్కా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల (తోఫా) పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరాజ్ ఖాన్, వేణుధర్ రెడ్డి, రహాత్ అలీ, పున్న, వెంకటేష్ గౌడ్, అజీమొద్దీన్, ఇలియాస్, ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |