యాదగిరిగుట్ట పట్టణంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం 4వ ఆవిర్భావ మహాసభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.బీసీ పితామహులు దార్శనికులు గౌ: శ్రీ బిందెశ్వరి ప్రసాద్ మండల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో గొర్రెల కాపరుల నాలుగో ఆవిర్భావ మహాసభను నిర్వహించుకోవడం చాలా సంతోషమన్నారు.మీ బిడ్డగా అసెంబ్లీలో మీ సమస్యలను మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa