తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. అలాగే, వడదెబ్బతో మరణించిన వ్యక్తి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.విపరీతమైన వేడి, వడగాల్పుల మధ్య బయట ఎండలో లక్షలాది మంది పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవుట్ డోర్ కార్మికులను రక్షించడానికి తక్షణ ప్రభుత్వ చర్యను డిమాండ్ చేసింది. వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించాలని డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa