ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక సందేశం అందించిన మహాన్ గురువు గౌతమ బుద్ధుని జన్మదినమైన వైశాఖ పౌర్ణమి సందర్భంగా వచ్చే 12వ తేదీన మెట్పల్లిలో బుద్ధ పూర్ణిమ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నవయాన్ బుద్ధిష్టు సొసైటీ మెట్పల్లి, బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద వివిధ బౌద్ధ సంఘాల నాయకులు కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నవయాన్ బుద్ధిష్టు సొసైటీకి చెందిన దయ్య రఘువీర్ నవయాన్ పాల్గొన్నారు.
బుద్ధుని జీవిత సందేశాలు అహింస, జ్ఞానం, సమత్వం — నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని కార్యక్రమంలో నాయకులు పేర్కొన్నారు. ప్రజలందరూ పెద్దఎత్తున హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa