జమ్మికుంట మండలం పాపక్కపల్లికి చెందిన గాజవేని రవళి (27)ని అదనపు కట్నం కోసం వేధించిన ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని సీఐ రవి బుధవారం వెల్లడించారు. రవళికి ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ఉమ్మనవేణి మహేష్ (30)తో 2024లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల నగదు, 9 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు.
వివాహం తర్వాత రెండు నెలలు సజావుగా సాగినా, ఆ తర్వాత మహేష్ తన అత్తమామలు, ఆడపడుచుతో కలిసి రూ. 10 లక్షల అదనపు కట్నం కావాలని రవళిని వేధించారని సీఐ తెలిపారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa