ఏఐవైఎఫ్ (ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్) 17వ జాతీయ మహాసభలు మే 15 నుండి 18 వరకు తిరుపతిలో జరగనున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి మానస్ కుమార్ మరియు కార్యదర్శి మార్కపురి సూర్య పిలుపునిచ్చారు.
బుధవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద జాతీయ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తగులుతోందని వారు వ్యాఖ్యానించారు.
ఈ మహాసభల ద్వారా యువతలో చైతన్యం పెంచుతూ, దేశ ప్రగతిలో వారి పాత్రను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నేతలు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa