జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన రామానాయుడు, హైదరాబాద్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే అతడి వివాహం నిశ్చయమై, ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్ల కోసం సెలవు తీసుకొని బుధవారం స్వగ్రామం వెళ్తుండగా, అయిజ మండలం వెంకటాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామానాయుడు చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. పెళ్లి ముహూర్తానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండగా ఈ ప్రమాదం జరగడం, కుటుంబాన్ని కన్నీటిలో ముంచింది. ఆనందోత్సవాలతో మక్కువగా ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రామానాయుడుని చివరి చూపుకు స్థానికులు భారీగా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa