బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు . తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లలో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు . పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు. టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి అయినప్పటికీ, కాంగ్రెస్ నాయకుడి సూచన మేరకు తిరిగి 3:36 గంటలకు టెండర్ బాక్స్ సీల్ తెరిచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్ళీ బాక్స్ సీల్ చేశారు . పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడి మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి టెండర్ వచ్చే విధంగా, రూ.60 కోట్ల విలువ చేసే టెండర్ పైన 25% ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీ ముందు పెడుతున్నాను అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa