రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సివిఆర్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జన్మదిన కేక్‌ను కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సలీం, ఆర్టీవో జిల్లా మెంబర్ పోషల్ రాజేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa