ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేసవి సెలవుల్లో పాఠశాలలో తరగతులు నిర్వహించడాన్ని ఆదేశిస్తూ, సోమవారం కడ్తాల్‌లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ధర్నాకు దిగారు. పాఠశాలకు వచ్చి కొనసాగుతున్న తరగతులను అడ్డుకొని, విద్యార్థులను ఇంటికి పంపించేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత మండల విద్యాధికారి (ఎంఈఓ)కి ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తాము ఈ చర్యకు పాల్పడ్డామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, ఇతరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa