తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీలో ఉన్న బాలికల జూనియర్ కళాశాలలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ, "ఏదైనా పనుల కోసం లేదా ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారని" అన్నారు. అయితే, తాను అలా డబ్బులు తగినట్లు తీసుకోనని, కేవలం పాఠశాల అభివృద్ధి కోసం సహకారం కోరినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై పలు రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై మంత్రి తదుపరి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |