కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్‌పల్లి డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
బహదూర్‌పల్లి డబుల్ బెడ్‌రూమ్ సొసైటీ సభ్యులు మరియు లబ్దిదారుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఆయన వినిపించారు. వారి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. కూన శ్రీశైలం గౌడ్ ఈ సందర్భంగా లబ్దిదారుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
![]() |
![]() |