తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని ఎన్నారైలు ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి (BRS) స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ‘సిల్వర్ జూబ్లీ’ వేడుకలను కూడా నిర్విహించనున్నారు.
ఈ వేడుకలలో భాగంగా జూన్ 1న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
వచ్చే 10 రోజుల పాటు అమెరికాలోని పలు నగరాల్లో BRS ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎన్నారైలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
అమెరికాలోని ఎన్నారైలు తమ మాతృరాష్ట్రం తెలంగాణతో మమేకమై ఉండేందుకు, పార్టీతో అనుసంధానాన్ని మరింత బలపరచేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ వేడుకలు BRS పార్టీకి, అలాగే గల్ఫ్ దేశాల్లో, ఇతర విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగినవిగా మారనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa