తెల్లాపూర్ : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దేవాలయాల నిర్మాణాల అంశంలో తన దైవభక్తిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి 60 లక్షల రూపాయల భారీ విరాళం అందించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మించాలని కోరుతూ స్థానిక విశ్వబ్రాహ్మణులు విజ్ఞప్తి చేయడంతో.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వంతో చర్చించి తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో విలువైన స్థలాన్ని గుడి నిర్మాణానికి కేటాయించడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి ఉడతా భక్తిగా 60 లక్షల రూపాయలు సొంత నిధులు అందించడంతోపాటు.. ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించారు. సోమవారం ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులోనూ నియోజకవర్గం వ్యాప్తంగా దేవాలయం నిర్మాణాలకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల నిర్మాణానికి సైతం సంపూర్ణ సహకారం అందిస్తూ మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, శ్రీధర్ చారి, పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఇంద్రా రెడ్డి, శ్రీశైలం చారి, గోపాల్ చారి, ప్రకాష్ చారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |