ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆపరేషన్ సింధూర్' పై బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటలు తూటాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 04:50 PM

'ఆపరేషన్ సింధూర్' విషయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్-ఎ-పాకిస్థాన్' ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన పాకిస్థాన్ అవార్డు కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనికి కాంగ్రెస్ కూడా ఘాటుగానే బదులిస్తూ, బీజేపీ నేతల పేర్లను ఈ అవార్డుకు సూచించింది. ఈ రాజకీయ వివాదం నేపథ్యంలో, అసలు గతంలో ఈ పాకిస్థాన్ పురస్కారాన్ని అందుకున్న భారతీయులు ఎవరు, ఎందుకు వారికి ఈ గౌరవం దక్కింది అనే ఆసక్తికర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa