తలసేమియా వంటి ప్రమాదకరమైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం రక్తదాన శిబిరం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల ఆదిత్య ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న ఈ శిబిరాన్ని డాక్టర్ బాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర రక్తమార్పిడి అవసరం. అందుకు మనం అందించే రక్తదానం చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలి,” అని తెలిపారు.
రక్తదానం చేయదలచిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదిత్య ఆసుపత్రిలో రక్తదానం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ శిబిరం ద్వారా అనేక మంది చిన్నారులకు నూతన ఆశను అందించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa