భూ భారతి చట్టం అమలులో భాగంగా, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు వెల్లడించారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ విజయేందిర బోయి ప్రారంభించనున్నారు. భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా, నియమించనున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అవసరమైన సాంకేతిక, ప్రామాణిక అంశాలపై ఈ శిక్షణలో స్పష్టతనిచ్చే ప్రయత్నం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనాల్సిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు తప్పక హాజరుకావాలని, ఇది భవిష్యత్‌లో వారి విధుల నిర్వహణకు ఎంతో దోహదపడుతుందని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa