నగర అభివృద్ధికి ఓ కొత్త దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయని, టీయూఐడీఎఫ్ ద్వారా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.220.94 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఆదివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఈ అభివృద్ధి యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “విజన్ 2047”లో భాగంగా మహబూబ్ నగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇప్పటికే పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని వెల్లడించారు.
భవిష్యత్తులో బూత్ పూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్‌లను కలిపి ట్రైసిటీగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతాన్ని ఒక అద్భుత మహానగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందని చెప్పారు. ఇది మహబూబ్ నగర్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa