ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిపోయే వరకు నేనే గొప్ప అనుకునే వ్యక్తి కేసీఆర్.. ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 01:31 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ వ్యవహారం గులాబీ పార్టీలో దుమారం రేపుతోంది. కవితకు పార్టీకి మధ్య ఏం జరిగింది.. ఈ ఎపిసోడ్ లో ఇంకేం జరగబోతున్నదనే చర్చ రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ వ్యక్తిగత అంశాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక వ్యక్తిపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటే ఇక అతకడం అసాధ్యం అన్నారు. కూతురు కవిత విషయంలోనూ ఎక్కడో అలాంటి నెగిటివ్ అభిప్రాయం వచ్చి ఉంటుందన్నారు. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటల.. కేసీఆర్ కుసంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ తనకు తాను ఒక చక్రవర్తిల వ్యవహరిస్తారు. ఆయనకు ఎవరు ఎదురు చెప్పవద్దు, విమర్శించవద్దు. ఆయన పనులను తప్పుపట్టద్దు. 20 ఏళ్ళు కేసీఆర్ తో ఉన్నానని చాలా దగ్గరగా అన్ని గమనించారు. ఆయన ఛట్రంలో ఇమడని వారిని కేసీఆర్ దగ్గరకు రానివ్వరన్నారు. కేసీఆర్ రాచరికపు పోకడలు, నియంతృత్వం, నమ్ముకున్నోళ్లను ఆయన నట్టెట ముంచే పద్ధతి, వ్యక్తులను వాడుకుని వదిలేసే నైజం ఫలితమే రాజకీయంగా ఆయనను బొందపెట్టిందన్నారు. కవితకు వాళ్ల కుటుంబంలో ఎక్కడో ఏదో తేడా వచ్చిందని ఇక అతికే ప్రసక్తే లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడున్నా వదలడు.. కేసీఆర్ కు మనం ట్యూన్ కావాల్సిందే తప్ప ఆయన మనకు ట్యూన్ కారని.. కూలిపోయే వరకు నేనే గొప్ప అనుకునే వ్యక్తి కేసీఆర్ అన్నారు. వాస్తవాన్ని అంగీకరించే మూడ్ లో కేసీఆర్ లేరని చెప్పారు. కేసీఆర్ మనసులో పడ్డవాడిని ఎక్కడున్నా ఎప్పుడైనా మళ్లీ అవకాశం వస్తే ఖతం పట్టిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ఒక వేళ దగ్గరకు తీసినా ఆయనకు అవసరం వచ్చినప్పుడు మళ్లీ బొందపెట్టే ప్రయత్నమే చేస్తారు తప్ప అన్ని మర్చిపోయి ముందుకు తీసుకువెళ్లరని అన్నారు. కేసీఆర్ ఎవరినైనా టార్గెట్ చేస్తే ఆయనకు మరో పని చేయరని అదే పనిమీద ఉంటారని అందులో ఎవరికి మినహాయింపు లేదన్నారు. గతంలోనూ హరీశ్ రావు, ఈటల కలిసి సొంత పార్టీ పెట్టబోతున్నారని జరిగిన ప్రచారం పై స్పందిస్తూ నమ్మకం లేని వాళ్లకు సుఖం తక్కువ అని సెటైర్ వేశారు. ఎవరో చెప్పిన మాటలు విని కేసీఆర్ తనను దూరం చేసుకున్నారని బయటకు వెళ్లడాకి కారణం ఎవరని ప్రశ్నించారు. హరీశ్ రావు ఎపిసోడ్ ఈనాటిది కాదని 2016 నుంచి నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో హరీశ్ రావు టచ్ లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఈటల స్పందించారు. ఆయన మాతో టచ్ లో లేరని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa