మంచిర్యాల జిల్లాలో ఆదివారం రోజు సగటున 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల చినిపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసాయి.
లక్షెట్టిపేట మండలంలో అత్యధికంగా 21.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:
జైపూర్: 13.2 మి.మీ.
మంచిర్యాల: 10.2 మి.మీ.
వేమనపల్లి: 9.2 మి.మీ.
నెన్నెల: 9 మి.మీ.
నస్పూర్: 9.9 మి.మీ.
జన్నారం: 7 మి.మీ.
భీమిని: 6.8 మి.మీ.
కన్నెపెల్లీ: 6.2 మి.మీ.
కాసిపేట: 5.1 మి.మీ.
మందమర్రి: 4.4 మి.మీ.
కోటపల్లి: 4 మి.మీ.
భీమారం: 4.2 మి.మీ.
చెన్నూరు: 3.8 మి.మీ.
బెల్లంపల్లి: 3.1 మి.మీ.
తాండూర్: 2.2 మి.మీ.
దండేపల్లి: 0.7 మి.మీ.
ఈ వర్షంతో ఖరీఫ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa