కాసిపేట మండల కేంద్రంలో సోమవారం ఒక సద్భావన కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం విశేషం. జనని వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కార్పొరేటర్ రామచందర్ హాజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యతను వివరించి, యువత రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారిని నిర్వాహకులు అభినందించారు. ఈ తరహా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa