ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిలిత సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, దర్తి ఆబా యోజన, జూన్ 2 న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, పౌరసరఫరాలు తదితర అంశాలపై సమీక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa