అప్రెంటిసెస్‌లకు ఇచ్చే స్టైఫండ్‌ను కేంద్రం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 5 కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.9,000 మధ్య ఉన్న స్టైఫండ్ ఇప్పుడు రూ.6,800 నుంచి రూ.12,300కు చేరనుంది. కేంద్రమంత్రి జయంత్ నేతృత్వంలోని అప్రెంటిస్‌షిప్ మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పెంపును నోటిఫై చేస్తే జూలై నుంచి అమల్లోకి రానుంది. PM-NAPS కింద కేంద్రం రూ.1,500 లేదా 25%, NATS కింద 50% సబ్సిడీ ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa