తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం రేషన్‌కార్డులు మంజూరు చేస్తుండటంతో దీనిపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల మంజూరు వేళ.. కేంద్రం ఊహించని షాకిిచ్చింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని తెలిపింది. నకిలీ ఆధార్ కార్డులు పెట్టి రేషన్ కార్డులు పొందుతున్నారని.. కొన్ని చోట్ల మైనర్లకు కూడా కార్డులు మంజూరు చేశారని వెల్లడించింది. అక్రమ రేషన్‌కార్డుల గుట్టు రట్టు చేయడమే కాక వీటి జారీపై అనుమానాస్పదంగా ఉన్న కార్డుల వివరాలను రాష్ట్రానికి పంపింది. ఆ వివరాలు..
తెలంగాణలో లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. కొందరు రేషన్ కార్డులో మార్పుల గురించి అప్లై చేసుకున్నారు. అధికారులు ఈ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త కార్డులు మంజూరు చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ అవుతున్న కార్డులకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. ఆ వివరాలు వెల్లడించింది.
తాజాగా జారీ చేస్తున్న కొత్త రేషన్ కార్డుల్లో పలువురు అక్రమాలకు పాల్పడినట్లు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాక ఒక్క కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 1700 అక్రమ కార్డులున్నట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేయడమే కాక ఆ కార్డుల వివరాలను జిల్లాకు పంపించింది. దీనిపై అప్రమత్తమైన అధికారులు కేంద్రం నుంచి వచ్చిన కార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేంద్రం పంపిన 1400 కార్డుల వివరాల్లో ఇప్పటికే 83 శాతం కార్డుల వివరాలపై తహసీల్దార్లు విచారణ పూర్తి చేశారు. మరో 280 పరిశీలించాల్సి ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.
అలానే కొన్ని ప్రాంతాల్లో మైనర్ల పేరిట కూడా కార్డులు జారీ చేశారని.. మరికొన్ని చోట్ల నకిలీ ఆధార్ కార్డులు పెట్టి రేషన్ కార్డులు పొందిన వారు కూడా ఉన్నట్లు పరిశీలనో తేలిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ కార్డులు భారీగా ఉన్నాయని.. వీరు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత.. ప్రతీ నెల 10-15 శాతం మంది రేషన్ సరకులు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. వీటి గురించి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa