ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 06:19 PM

బంగారం ధరలు మే 31వ తేదీ శనివారం భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 96,200 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87530 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 99744 పలికింది అని చెప్పవచ్చు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయితో పోల్చి చూస్తే దాదాపు 5వేల రూపాయలు తక్కువగా పలుకుతోంది అని చెప్పవచ్చు. ప్రధానంగా బంగారు ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్లో భారీగా బంగారం ధర తగ్గుతోంది. బంగారం ధరలు ప్రస్తుతం భారీగా తగ్గుతున్నాయి. దీనికి కారణం ప్రధానంగా డాలర్ విలువ బలపడటమే అని చెప్పవచ్చు. డాలర్ బలపడే కొద్ది బంగారం ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి... ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా ప్రస్తుతం దాదాపు 5000 రూపాయలు తక్కువ పలుకుతున్నాయి. గతంలో బంగారం ధరలు ఒక లక్ష రూపాయలు దాటి ఆల్ టైం రికార్డును నమోదు చేశాయి. అక్కడ నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం ధరకు చేరుకున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 25% పెరిగినట్లు చూడవచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విధించిన టారిఫ్ ప్లాన్స్ విషయంలో న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే పసిడి మార్కెట్లో లాభాల స్వీకరణ అనంతరం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పవచ్చు . గతం నాలుగు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. అమెరికాలోని కామెక్స్ మార్కెట్ మల్టీ కమిటీ ఎక్స్చేంజ్ లో బంగారం ధర ప్రస్తుతం ఒక ఔన్స్ ధర 3280 డాలర్ల వద్ద పలుకుతోంది. గతంలో ఇది 3500 డాలర్ల వద్ద ఉంది. ఇక్కడి నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బంగారం పై గతంలో పెట్టిన పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు కూడా బంగారం ధరలు తగ్గడానికి దోహదపడుతుంది. ఇదిలా ఉంటే బంగారం షాపింగ్ చేసేవారికి తగ్గుతున్న బంగారం ధరలు కాస్త ఊరట కల్పిస్తున్నాయని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa