తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, నాగార్జున కాలనీలో ఈజీ మనీ యాత్ర ప్రధాన కార్యాలయంలో హనుమాన్ ఉపాసకులు పుండరీక వరదానంద స్వామీజీచే హనుమాన్ చాలీసా పారాయణ సామూహికంగా ఆదివారం నిర్వహించారు. ఆ సంస్థ అధినేత రాజేష్ నాయర్ మాట్లాడుతూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా వుందని హర్షం వ్యక్తపరిచారు. అనంతరం అర్చనలు జరిపి హారతులిచ్చారు. కార్యక్రమమలో డాక్టర్ రవికుమార్, మంచిర్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa