కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శేఖర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయని తెలిపారు. ప్రత్యేకించి శ్రీకాంతాచారి వంటి మహానుభావులు తమ ప్రాణాలర్పణతో రాష్ట్ర ఆవిర్భావానికి దారితీర్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర విలువైనదని, యువత ఈ పోరాట చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులు తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకను మరింత అర్థవంతంగా మార్చారు. దేశభక్తి గీతాలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం ఉత్సాహంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa