ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 10:34 AM

TG: విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ట్రావెల్స్‌ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa