హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మంగళవారం చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను ప్రొక్లయిమ్డ్ అఫెండర్‌గా ప్రకటించేందుకు కోర్టు గతంలో నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 20వ తేదీలోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై స్పందిస్తూ ప్రభాకర్‌రావు న్యాయస్థానానికి వచ్చారు. అయితే, జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa