హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణం అంటే సమయం వృథా, ఖర్చుల భారం. దీంతో చాలా మంది నగరవాసులు వేగవంతమైన.. సౌకర్యవంతమైన రవాణా కోసం మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. మెట్రో ఛార్జీలు ఇటీవల పెరిగినప్పటికీ.. రోడ్డు మార్గాల ప్రయాణంతో పోలిస్తే మెట్రో ఇప్పటికీ మెరుగైన ఎంపికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, మెట్రో ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా మెట్రో, రాపిడో సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం కింద ఆసక్తికరమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.
ఒక మెట్రో ప్రయాణికుడి అనుభవం ప్రకారం.. ఎల్‌బీ నగర్ నుంచి ఖైరతాబాద్ వెళ్లడానికి అతను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన రాపిడో క్యూఆర్ కోడ్‌ను తన ఫోన్‌పే ద్వారా స్కాన్ చేశాడు. అది అక్కడ నుంచి ర్యాపిడో యాప్‌లోకి రీ డైరెక్ట్ అవుతుంది. అనంతరం.. ఎల్‌బీ నగర్ నుంచి ఖైరతాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకుని, METRO అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయగానే.. రూ.51 ఉన్న ప్రయాణ ఖర్చు కేవలం రూ.16లకు తగ్గిపోయింది. ఈ అనూహ్య తగ్గింపుతో ఆ ప్రయాణికుడు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి ర్యాపిడో యాప్ కచ్చితంగా ఉండాలి. లేని వారు ర్యాపిడో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. అక్కడ నుంచి కూడా మెట్రో టికెట్స్ అనే ఆప్షన్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఎల్బీ నగర్ నుంచి ఖైరతాబాద్ వరకే కాదు.. ఏ స్టేషన్ నుంచి .. ఎక్కడికి అయినా ఆ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ప్రత్యేక ఆఫర్ రాపిడో, మెట్రో సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా అందిస్తున్నారు. అయితే.. ఇది ఒక యూజర్‌కు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. ఒక్కో యూజర్‌కు ఒక్కో రకంగా ఆఫర్ వస్తుందని.. సాధారణంగా ప్రయాణ ఛార్జీలో 50 శాతం వరకు తగ్గుదల ఉంటుందని సంస్థలు ప్రకటించినప్పటికీ, కొంతమంది ప్రయాణికులకు ప్రకటించిన దానికంటే తక్కువ తగ్గింపు లభిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఒకసారి ప్రయత్నించి.. చౌకగా మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించండి.
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ నగర రవాణాను సమూలంగా మార్చివేసింది. ట్రాఫిక్ జామ్ సమస్యలు, అధిక ఇంధన వ్యయం, ప్రయాణ సమయం వృథా వంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి మెట్రో ఒక ఉత్తమ మార్గంగా నిలుస్తోంది. నగరం నలుమూలలకూ విస్తరిస్తున్న మెట్రో మార్గాలు, దాని అత్యాధునిక సౌకర్యాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తమ దైనందిన ప్రయాణాలకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు.
మెట్రో సంస్థ ప్రయాణికులకు సౌలభ్యం కోసం మెట్రో పాస్‌లను కూడా అందిస్తోంది. సాధారణ టోకెన్లతో పాటు, స్మార్ట్ కార్డులు, నెలవారీ పాస్‌లు,ఇతర రాయితీ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తరచుగా ప్రయాణించే వారికి గణనీయమైన ఖర్చు ఆదాను అందిస్తాయి. మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉండే వివిధ రకాల టికెటింగ్ ఎంపికలు, డిజిటల్ చెల్లింపుల సౌకర్యాలు ప్రయాణికులకు మరింత సులభతరం చేస్తాయి. నగరంలో పెరుగుతున్న జనాభాకు, వేగవంతమైన విస్తరణకు అనుగుణంగా మెట్రో సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa