దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ, సాంకేతిక నవీకరణ పనుల కారణంగా.. భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రం గుండా ప్రయాణించే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పనుల ప్రభావం చక్రధర్‌పూర్ డివిజన్‌పై ఎక్కువగా ఉన్నందున.. రైలు సేవలలో ఈ అంతరాయం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రయాణాలకు సిద్ధమవుతున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి.. తమ పర్యటనలను అందుకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఈ రైళ్ల రద్దు వల్ల ముఖ్యంగా చర్లపల్లి, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన ప్రయాణికులపై ప్రభావం పడనుంది.
రద్దయ్యే రైళ్ల వివరాల విషయానికి వస్తే.. ప్రయాణికుల సౌలభ్యం కోసం పూర్తి సమాచారం.. రద్దు చేయబడిన రైళ్ల వివరాలను భారతీయ రైల్వే పంచుకుంది. ఇది ప్రయాణికులకు తమ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రైలు సంఖ్య 17007 చర్లపల్లి - దర్భంగా ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంలో): 2025, ఆగస్టు 26 , సెప్టెంబర్ 9 తేదీలలో ఈ రైలు సేవలు రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. రైలు సంఖ్య 17008 దర్భంగా - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంలో): 2025, ఆగస్టు 29 , సెప్టెంబర్ 12 తేదీలలో ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు.
ట్రైన్ సంఖ్య 18523 విశాఖపట్నం - బనారస్ ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంలో).. 2025, ఆగస్టు 27, ఆగస్టు 31, సెప్టెంబరు 7, సెప్టెంబరు 10 తేదీలలో ఈ రైలు నడవదు. రైలు సంఖ్య 18524 బనారస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంలో).. 2025, ఆగస్టు 28, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8 , సెప్టెంబర్ 11 తేదీలలో ఈ రైలు రద్దు చేయబడింది. రైలు సంఖ్య 17005 హైదరాబాద్ - రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంలో).. 2025, ఆగస్టు 28న ఈ రైలు సేవలు నిలిపివేయబడతాయి.
ట్రైన్ నంబర్ 17006 రక్సౌల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (రాంచీ మార్గంలో).. 2025, ఆగస్టు 31న ఈ రైలు నడవదు.
ట్రైన్ నంబర్ 07051 చర్లపల్లి - రక్సౌల్ స్పెషల్ (రాంచీ మార్గంలో).. 2025, ఆగస్టు 30న ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉండవని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైన్ నంబర్ 07052 రక్సౌల్ - చర్లపల్లి స్పెషల్ (రాంచీ మార్గంలో).. 2025, సెప్టెంబర్ 2న ఈ ప్రత్యేక రైలు రద్దు కానుంది. ట్రైన్ నంబర్ 07005 చర్లపల్లి - రక్సౌల్ స్పెషల్ (రాంచీ మార్గంలో).. 2025, సెప్టెంబర్ 1న ఈ ప్రత్యేక రైలు సేవలు నిలిచిపోతాయి. ట్రైన్ నంబర్ 07006 రక్సౌల్ - చర్లపల్లి స్పెషల్ (రాంచీ మార్గంలో).. 2025, సెప్టెంబర్ 4న ఈ ప్రత్యేక రైలు రద్దు చేయబడుతుంది.
రైల్వే శాఖ ఈ కీలక నిర్వహణ పనులను ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, రైల్ మదద్ హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా.. బస్సులు లేదా ఇతర రవాణా మార్గాలను పరిశీలించాలని తెలిపారు.
రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి.. ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ఈ నిర్వహణ పనుల ప్రధాన లక్ష్యం అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత రైలు సేవలు మరింత సమర్థవంతంగా.. వేగంగా ఉంటాయని ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa