ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సహాయ నిధి చెక్కుల స్కామ్..ఆరుగురు అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 03:22 PM

కోదాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా తెలిపారు. వారి వద్ద నుండి రూ. 9,30,000 నగదు, 5 సెల్ ఫోన్లు, 6 వాడని చెక్కులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వివరాలను ఆయన సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ శివశంకర్ కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa